‘అనవసరంగా రోడ్లపైకి వచ్చి మా​కు పని కల్పించొద్దు’

8 May, 2021 20:00 IST|Sakshi

సాక్షి,విజయవాడ: కర్ఫ్యూ అమలును సిటీ పోలీస్ విజయవాడ కమిషనర్ బత్తిన శ్రీనివాస్ పరిశీలించారు. గొల్లపూడి, మహానాడు సెంటర్, బెంజి సర్కిల్‌లో కర్ఫ్యూని సీపీ పర్యవేక్షించారు. పోలీస్‌ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. కర్ఫ్యూని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. సీపీ మాట్లాడుతూ.. కర్ఫ్యూకి ప్రజలు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. మరో పదిరోజులు ఇదే సహకారం అందించాలని కోరారు. సరుకులు, కూరగాయలకు మూడు రోజులకొకసారి బయటకు రావాలని సూచించారు. 

స్వీయ నియంత్రణ పాటించి కరోనా కట్టడికి సహకరించాలని కోరారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి పోలీసులకు పని కల్పించవద్దన్నారు. మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత మినహాయింపు ఉన్న వారికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ప్రయాణాలు మానుకోవాలని, ప్రజారోగ్య పరిరక్షణకోసం ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని గౌరవించాలన్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని సీపీ పేర్కొన్నారు.

చదవండి: జిందాల్‌ యాజమాన్యానికి వైద్యారోగ్యశాఖ కృతజ్ఞతలు

>
మరిన్ని వార్తలు