సీపీఐ నారాయణకు సతీవియోగం

14 Apr, 2022 18:24 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

హైదరాబాద్‌: సీపీఐ సీనియర్‌ నేత నారాయణ భార్య వసుమతి కన్నుమూశారు. అనారోగ్యంతో గత కొంతకాలంగా తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఆమె కన్నుమూసినట్లు తెలుస్తోంది. రేపు(శుక్రవారం) ఉదయం 11 గంటలకు నగరి నియోజకవర్గం ఐనంబాకం గ్రామంలో వసుమతి అంత్యక్రియలు జరుగుతాయని చిత్తూరు జిల్లా సీపీఐ కార్యదర్శి రామానాయుడు తెలిపారు. 

ప్రముఖుల సంతాపం:

సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సతీమణి మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్‌ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 
సీపీఐ జాతీయ కార్యదర్శి  డాక్టర్ కె. నారాయణ గారి సతీమణి  వసుమతి దేవి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు.  విద్యార్థిగా ఎఐఎస్ ఎఫ్‌లో ప‌ని చేసి, అనంత‌రం బ్యాంక్ ఉద్యోగిగా ప‌ని చేశారు. త‌రువాత వాలంట‌రీ రిటైర్‌మెంట్ తీసుకొని కమ్యూనిస్టు పార్టీలో ప‌ని చేశారు. ప్ర‌జా స‌హాకారంతో ప్రారంభించిన 99 టీవీ ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. కామ్రేడ్ వ‌సుమ‌తి మృతి ప‌ట్ల నారాయ‌ణ‌కు, వారి  కుటుంబ సభ్యులకు సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి త‌రుపున ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు.

మరిన్ని వార్తలు