ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే రుణ పరిమితి

28 Jul, 2021 04:40 IST|Sakshi

ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి మదింపు చేయలేదు

రాజ్యసభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి

సాక్షి, న్యూఢిల్లీ : 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే ఆంధ్రప్రదేశ్‌ సహా అన్ని రాష్ట్రాలకు గరిష్ట రుణ పరిమితిని నిర్దేశించామని, జీఎస్‌డీపీ ఆధారంగా ఆయా రాష్ట్రాల ఆర్థిక ప్రణాళికలకు సంఘం సూచనలు చేస్తుందని రాజ్యసభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి తెలిపారు. జీఎస్‌డీపీలో 4 శాతం వరకు రుణాలు తీసుకునేలా అనుమతించామన్నారు. 2018–22 వరకు ఆంధ్రప్రదేశ్‌కు విధించిన అప్పుల పరిమితి ప్రకారం.. 2018–19లో రూ.27,569 కోట్లు, 2019–20లో రూ.32,417 కోట్లు, 2020–21లో రూ.30,305 కోట్లు, 2021–22లో రూ.42,472 కోట్లను నికర గరిష్ట రుణ పరిమితిగా విధించామని మంత్రి తెలిపారు.

2019–20 కాలంలో పన్నుల రాబడి తగ్గినందున ప్రత్యేక పథకం కింద రూ.2,534 కోట్లు అదనంగా రుణం తీసుకునేందుకు అనుమతించామని వెల్లడించారు. ఇక 2020–21 కాలంలో జీఎస్‌డీపీపై రెండు శాతం అదనపు రుణాలకు అనుమతిచ్చామని, అందులో భాగంగానే ఏపీకి రూ.19,192 కోట్లకు అనుమతి మంజూరు చేశామన్నారు. దీనికి అనుగుణంగా ఎఫ్‌ఆర్‌ఎంబీ చట్టానికి రాష్ట్రాలు సవరణలు చూసుకోవాలని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు పంకజ్‌ చౌధరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అంతేగాక.. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మదింపు చేయలేదన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కాగ్‌ వెల్లడించిన లెక్కల ప్రకారం ద్రవ్యలోటు తొలుత రూ.68,536 కోట్లుగా లెక్కించారని, అయితే.. రాష్ట్ర బడ్జెట్లో సవరించిన అంచనాల ప్రకారం ద్రవ్యలోటును రూ.54,369.18 కోట్లుగా లెక్కించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. అంతేగాక.. 2020–21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి వాస్తవ ద్రవ్యలోటు రూ.53,702.73 కోట్లుగా తేలిందని కేంద్రమంత్రి చెప్పారు.

గిరిజన ప్రాంతాల్లో ఇళ్లకు రూ.3లక్షలు ఇవ్వాలి
ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకంలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో ఇంటి నిర్మాణానికి  రూ.3 లక్షలు చొప్పున ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి కోరారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.1.8 లక్షలు గిరిజన ప్రాంతాల వారికి సరిపోదన్నారు. గిరిజన ప్రాంతాలకు సరకు రవాణా ఖర్చు ఎక్కువవుతుందని, అందుకు రూ.3లక్షలు చొప్పున ఇవ్వాలని ఆమె మంగళవారం లోక్‌సభలో ప్రస్తావించారు. 

ఆ రోడ్లను హైవేలుగా మార్చండి
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం జిల్లాలోని సబ్బవరం నుంచి నర్సీపట్నం, నర్సీపట్నం నుంచి తుని మధ్య ఉన్న రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెం టరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి,లోక్‌ సభాపక్ష నాయకుడు పీవీ మిధున్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీల బృందం మంగళవారం గడ్కరీతో సమావేశమైంది. విశాఖ జిల్లాలో విస్తృతమైన రోడ్‌ నెట్‌వర్క్‌ ఉన్నప్పటికీ నా నాటికీ పెరుగుతున్న వాహనాల రద్దీ కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సబ్బవరం జం క్షన్‌ నుంచి వెంకన్నపాలెం, చోడవరం, వడ్డా ది, రావికమతం, కొత్తకోట మీదుగా నర్సీపట్నం వరకు ఉన్న రాష్ట్ర రహదారి (ఎస్‌హెచ్‌–009), నర్సీపట్నం నుంచి గన్నవరం, కోట నందూరు మీదుగా తుని వరకు ఉన్న రహదారి (ఎస్‌హెచ్‌–156) అత్యంత రద్దీ కలిగి ఉన్నందున వీటిని జాతీయ రహదారులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. లోక్‌సభ సభ్యులు డాక్టర్‌ బి.సత్యవతి, గొడ్డేటి మాధవి, ఎంవీవీ సత్యనారాయణ, బెల్లాన చంద్రశేఖర్, చింతా అనురాధ, మార్గాని భరత్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, సంజీవ్‌కుమార్, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఉన్నారు. 

రూ. 6,750 కోట్ల ‘ఉపాధి’ బకాయిలివ్వండి 
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి రావలసిన రూ.6,750 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ ఎంపీలు  కేం ద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు విజ్ఞప్తిచేశారు. వైఎ స్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి, పార్టీ లోక్‌సభా పక్షనేత  మిథున్‌రెడ్డి సారథ్యంలో ఎంపీల బృందం మంత్రితో సమావేశమైంది. పనిదినాలను 100 నుంచి 150కి పెంచాలని కోరుతూ  వినతిపత్రాన్ని అందించారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..‘ఉపాధి పథకం కింద 18.4 కోట్ల పనిదినాలతో దేశంలోనే అత్యధిక పని దినాలు కల్పించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ రికార్డు నెలకొల్పింది. కోవిడ్‌ మహమ్మారి సృష్టించిన విలయం నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పేదలకు కనీసం ఒక కోటి పనిదినాలు కల్పించాలని గత ఏప్రిల్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని తొమ్మిది జిల్లాల్లో విజయవంతంగా చేరుకోగలిగాం.  రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున చేపట్టిన భూముల రీసర్వేలో సర్వే రాళ్లు పా తే కూలీల వేతనాలను ఉపాధి పథకం కింద వినియోగించుకునేందుకు అనుమతించాలి. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధిం చి ఉపాధి పథకం కింద లేబర్‌ బడ్జెట్‌ను సవరించాలి’.. అని మంత్రిని కోరారు.

‘కాఫీ’ పెంపకాన్ని అనుమ తించండి
ఉపాధి హామీ పథకం కింద విశాఖ జిల్లా పాడేరులో కాఫీ తోటల పెంపకాన్ని గిరిజనులు చేపట్టేందుకు అనుమతించాలని కూడా విజయసాయిరెడ్డి మంత్రికి విజ్ఞప్తి చేశారు.  వారికి ఎంతో మేలు చేసినట్లవుతుందన్నారు. 

మరిన్ని వార్తలు