క్రైస్తవుల ఓట్లతో గెలిచి ఇప్పుడు కించపరుస్తారా? 

31 Oct, 2020 04:15 IST|Sakshi

ఎంపీ రఘురామకృష్ణరాజుకు సీఆర్‌పీఎస్‌ ప్రశ్న 

అక్కిరెడ్డిపాలెం (గాజువాక): నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నీతివంతుడైతే క్రిస్టియన్ల ఓట్లు అడగకుండా తిరిగి ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర క్రిస్టియన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ (సీఆర్‌పీఎస్‌) గౌరవాధ్యక్షుడు ఎం.సురేష్ కుమార్‌ సవాల్‌ విసిరారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో హిందువులందరినీ క్రైస్తవ మతంలోకి మార్చేస్తారని ఎంపీ చేసిన వ్యాఖ్యలపై  మండిపడ్డారు.

శుక్రవారం గాజువాక కాపు తుంగ్లాంలోని బిషప్‌ శామ్యూల్‌ లోపింట్‌ ఎంహెచ్‌జేసీ చర్చిలో క్రిస్టియన్‌ సంఘాల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎంపీగా గెలవడానికి ఎక్కువగా క్రిస్టియన్ల ఓట్లే కారణమని, ఇప్పుడు క్రిస్టియన్లను కించపరుస్తూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తంయ చేశారు. రాష్ట్ర సీఆర్‌పీఎస్‌ అధ్యక్షుడు వై.బాలారావు, ప్రధాన కార్యదర్శి ఎం.అనిల్‌కుమార్, కోశాధికారి వై.జార్జిబాబు, రాష్ట్ర ఇన్‌చార్జి జాషువా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు