Sri City: శ్రీ సిటీలో క్రయోజనిక్‌ ఆక్సిజన్‌

31 May, 2021 04:16 IST|Sakshi
ఆక్సిజన్‌ ప్లాంటుకు శంకుస్థాపన చేస్తున్న మంత్రులు అనిల్, గౌతమ్‌రెడ్డి

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడి 

సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే శ్రీ సిటీని క్రయోజనిక్‌ ఆక్సిజన్‌ తయారీ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని తెలిపారు. నెల్లూరు జీజీహెచ్‌లో పీఎం కేర్స్‌ నిధులతో ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్‌ ప్లాంటుకు జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌తో కలిసి మంత్రి గౌతమ్‌రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా థర్డ్‌ వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని, ఇందుకోసం రాష్ట్రంలో భారీగా ఆక్సిజన్‌ ఉత్పత్తి, వెంటిలేటర్లు వంటి వైద్య పరికరాల తయారీకి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ఇరవై రోజుల ముందు ఆక్సిజన్‌ కోసం ఇబ్బంది పడిన రాష్ట్రం ఇవాళ సర్‌ప్లస్‌లో ఉండటం ముఖ్యమంత్రి దార్శనికతకు నిదర్శనమన్నారు.   

మరిన్ని వార్తలు