పరేషాన్‌ చేసిన ‘చిల్డ్రన్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’

30 Mar, 2021 08:06 IST|Sakshi

చెత్తకుప్పలో నోట్ల కట్టలు!

తాడేపల్లిరూరల్‌(మంగళగిరి): స్థానిక ఉండవల్లి సెంటర్‌ ఎస్‌బీఐ సమీపంలో సోమవారం పంచాయతీ కార్మికులు చెత్త తొలగిస్తుండగా రూ.2 వేలు, రూ.500, రూ.200 నోట్ల కట్టలు కనిపించాయి. మొదట రూ.500 కట్ట కనబడగా, పంచాయతీ కార్మికులు దానిని తీసి దాచిపెట్టారు. చెత్త తీసేకొద్దీ కట్టలు కట్టలు బయటపడడంతో ఆందోళన చెందిన పంచాయతీ కార్మికులు సచివాలయం సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

సచివాలయం సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి, మొదట దొంగనోట్లు అనుకున్నారు. కట్టలన్నీ పరిశీలించగా వాటిపై ‘చిల్డ్రన్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’, ‘ఫర్‌ స్కూల్‌ జోన్‌ ఓన్లీ’ అని రాసి ఉండటంతో వారిలో వారు నవ్వుకొని దొరికిన ఆ కట్టలను తిరిగి చెత్తలో పడేసి డంపింగ్‌యార్డ్‌కు తరలించారు. సుమారు 30 కట్టల వరకు ఉన్నట్లు  పంచాయతీ సిబ్బంది తెలిపారు.
చదవండి: మాజీ ఎమ్మెల్యేకు నాలుగేళ్ల జైలు శిక్ష 

మరిన్ని వార్తలు