ఆశ పడ్డారా.. అంతా గోవిందా! 

22 Jul, 2021 08:25 IST|Sakshi

సైబర్‌ మోసాలపై అవగాహన పెంచుకోవాలి

వ్యక్తిగత, ఆర్థిక సమాచార గోప్యత పాటించాలి

అవగాహన కల్పిస్తున్న పోలీసులు  

శ్రీకాకుళం: కోటి రూపాయల లాటరీ అని మెసేజ్‌ వస్తుంది. మీ నంబర్‌ మా లక్కీ డ్రాలో ఎంపికైందని కాల్‌ వస్తుంది. అకౌంట్‌ నంబర్‌ చెప్తే డబ్బులు పంపిస్తామని తీయటి కబురొకటి వస్తుంది.. ఆశ పడ్డారా..? అంతా గోవిందా. ఆన్‌లైన్‌ మోసాలు మితిమీరిపోతున్నాయి. మెసేజీలు, కాల్స్‌ రూపంలో ఖాతాలు ఖాళీ చేయడానికి చోరులు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటారు. అప్రమత్తంగా ఉంటే ఈ మోసాల నుంచి బయటపడవచ్చని పోలీసులు సూచిస్తున్నారు. 

వ్యక్తిగత సమాచార తస్కరణ 
ఏదైనా ఒక సైబర్‌ నేరం చేయాలంటే మన వ్యక్తిగత సమాచారం అవతలి వ్యక్తికి చాలా అవసరం. ఇలాంటి సమాచారాలను మోసపూరిత పద్ధతుల ద్వారా సేకరించడం ఇప్పుడు ఎక్కువైంది. ఈ విధంగా సేకరించిన సమాచారం ఉపయోగించి ఆర్థిక మోసాలకు, నేరాలకు పాల్పడటం, ఆ వ్యక్తి పేరుతో ఫేక్‌ ప్రొఫైల్స్‌ తయారు చేసి బ్లాక్‌మెయిల్‌ చేయటం వంటివి ప్రధానంగా ఉన్నాయి. 

చోరులు అవలంబించే పద్ధతులు 
►సైబర్‌ నేరగాడు చాలా ఓర్పుగా అవతలి వ్యక్తితో మాట్లాడతాడు. మన బలహీనతలను గుర్తించి కావాల్సిన సమాచారం రాబడతాడు. డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు నంబర్లు, గడువు తేదీ, సీవీవీ కోడ్, ఓటీపీ వంటివి సేకరించి బ్యాంక్‌ ఖాతా నుంచి సొమ్మ కాజేస్తాడు. కొన్ని సార్లు సమాచారం పొందేందుకు తను పంపించే లింక్‌ ఓపెన్‌ చేసేలా ప్రేరేపించి తన పని కానిస్తాడు. 
►మెయిల్, ఎస్‌ఎంఎస్‌ పంపించటం, లింక్‌లు పంపించటం, బ్యాంక్, కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులమని ఫోన్‌ చేసి మోసం చేస్తుంటారు. డెబిట్, క్రెడిట్‌ కార్డు క్లోనింగ్‌ విధానంలో స్కిమ్మర్‌ అనే చిన్న ఎల్రక్టానిక్‌ సాధనం ఉపయోగించి డెబిట్, క్రిడిట్‌ కార్డు వెనుక వైపు ఉన్న మాగ్నెటిక్‌ స్ట్రిప్‌లో ఉన్న కార్డు సమాచారాన్ని అక్రమంగా దొంగలిస్తారు.  
►సైబర్‌ నేరగాళ్లు కీలోగ్గెర్స్‌ అనే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ పరికరాన్ని ఉపయోగించి ఈ–కామర్స్, సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ సైట్, మెయిల్‌ సర్వీసెస్‌ వంటి వాటిలో మన యూజర్‌ నేమ్, పాస్‌వర్డ్‌లను తెలుసుకుంటారు. మనం కంప్యూటర్‌పై టైప్‌ చేసే ప్రతి కీస్ట్రోక్, చాట్స్, స్క్రీన్‌ షాట్‌లను రికార్డు చేసి ఆ కాని్ఫడెన్షియల్‌ డాటాను తీసుకుంటారు. ఇలాంటివి సాధారణంగా ఇంటర్నెట్‌ కేఫ్‌ సెంటర్లు, స్మార్ట్‌ ఫోన్‌ సరీ్వసింగ్‌ సెంటర్లలో జరుగుతుంటాయి. ఫోన్‌ రిఫేర్‌ చేసే వ్యక్తి సెల్‌ఫోన్‌లో ఉన్న సమాచారం, ఫొటోలు సేకరించి సైబర్‌ సంబంధిత నేరాలు చేసేందుకు ఉపయోగించే అవకాశం ఉంది.  
►ఫ్రీ పబ్లిక్‌ వైఫై, ఫ్రీ నెట్‌వర్క్, హాట్‌స్పాట్‌లు వాడటం వల్ల కూడా డేటా, వ్యక్తిగత సమాచారం సేకరించే ప్రమాదం ఉంది. ఇలాంటి నెట్‌వర్క్‌ల్లో ఉంటే అన్‌ సెక్యూరిటీని ఉపయోగించి సైబర్‌ నేరస్తులు మన సున్నితమైన, పర్సనల్, ఫైనాన్షియల్‌ సమాచారంతో పాటు పాస్‌వర్డ్‌లను సేకరిస్తుంటారు.  

ఎలా మెలగాలి..?  
►బ్యాంక్, ఫైనాన్షియల్, కస్టమర్‌ కేర్‌ ప్రతినిధులమని ఎరైనా ఫోన్‌ చేసినా మాట్లాడకూడదు. ఈ–మెయిల్, ఎస్‌ఎంఎస్‌లు పంపించినా వాటిని ఓపెన్‌ చేయకూడదు. ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు, కార్డు నంబర్లు, గడువు తేదీలు నమోదు చేయవద్దు, ఫోన్‌ చేస్తే వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదు. ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్‌ వంటి సోషల్‌ మీడియా అకౌంట్లను భద్రంగా రక్షించుకోవాలి. 
►ఓపెన్, పబ్లిక్‌ వైఫై నెట్‌వర్క్‌లకు ఎప్పుడూ కనెక్టు కావద్దు. 
►సెల్‌ఫోన్‌ రిఫేర్‌కు ఇచ్చేటప్పుడు సిమ్‌కార్డు, మెమొరీ కార్డులను తీసివేయాలి. ఫోన్‌ మెమొరీ పూర్తిగా డిలీట్‌ చేయాలి. సోషల్‌ మీడియా వంటివి లాగ్‌ అవుట్‌ కావాలి.  
►బాగా నమ్మకం ఉన్న వారికే రిఫేర్‌కు ఇవ్వాలి.  
►ఇంటర్నెట్‌లో దొరికే సాఫ్ట్‌వేర్‌లను ఎప్పుడు ఇన్‌స్టాల్‌ చేయకూడదు. లేటెస్ట్‌ యాంటీ వైరస్‌తో అప్‌డేట్‌ చేసి ఉంచుకోవాలి.      

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు