జవాద్‌ తుపాన్‌: విద్యుత్ ప్రమాదాలు, అవాంతరాలు జరిగితే సమాచారం ఇవ్వండి

3 Dec, 2021 16:51 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. విశాఖపట్నానికి 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడి శుక్రవారం మధ్య బంగాఖాళాతంలో జవాద్‌ తుపానుగా మారుతుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు.

చదవండి: AP Rain Alert: బలపడిన వాయుగుండం

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) విద్యుత్‌ వినియోగదారులకు అప్రమత్తం చేసింది. జవాద్ తుఫాన్ వల్ల ఏర్పడే విద్యుత్ ప్రమాదాలు, అవాంతరాలకు సంబందించిన సమాచారాన్ని ఏపిఈపీడీసీఎల్ కంట్రోల్ రూమ్ నంబర్లకు తెలియజేయాలని పేర్కొంది. 

చదవండి: Cyclone Jawad: బలపడిన వాయుగుండం.. సాయంత్రం నుంచే అతి భారీ వర్షాలు

తుఫాన్ ప్రభావానికి తెగిపడిన విద్యుత్ వైర్లు, పడిపోయిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లపై పడిపోయిన చెట్లకొమ్మల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపింది. వాటి సమాచారాన్ని టోల్ ఫ్రీ నెం. 1912, కంట్రోలు రూమ్ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని ఏఎండీ కె.సంతోషరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కంట్రోలు రూమ్ ఫోన్ నెంబర్లు..
► విశాఖపట్నం కార్పోరేట్ ఆఫీసు- 9440816373 /  8331018762 
►  శ్రీకాకుళం- 9490612633
►  విజయనగరం-9490610102
►  విశాఖపట్నం-7382299975
►  తూర్పుగోదావరి-7382299960
►  పశ్చిమగోదావరి-9440902926

మరిన్ని వార్తలు