ఓటేస్తే చంపేస్తాం..!

18 Apr, 2021 04:56 IST|Sakshi
ఊరందూరు పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటు హక్కును వినియోగించుకుని ఆనందంగా వస్తున్న ఆ గ్రామ ప్రజలు

ఊరందూరులో బొజ్జల కుటుంబం అరాచకాలు 

మునిసిపాలిటీలో విలీనం నెపంతో ఎన్నికల బహిష్కరణ 

‘సాక్షి’ చొరవ, పోలీసుల సహకారంతో ఓటేసిన దళితులు  

సాక్షి, తిరుపతి: ప్రజాస్వామ్య ప్రక్రియలో పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ఓటుహక్కును వినియోగించుకోనివ్వకుండా మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సొంత ఊరు ఊరందూరులో పెత్తందార్లు అడ్డుకున్నారు. ఎస్టీ, ఎస్టీలే లక్ష్యంగా బొజ్జల సుధీర్‌రెడ్డి అనుచరులు శనివారం పోలింగ్‌ కేంద్రం వద్ద రచ్చ చేశారు. ఓటేస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు.

ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు తమ గ్రామాన్ని శ్రీకాళహస్తి మునిసిపాలిటీలో విలీనం చేసినందుకు పోలింగ్‌ను బహిష్కరిస్తున్నట్టు హకుం జారీ చేశారు. గ్రామ కట్టుబాట్లను పాటించాలని హెచ్చరించి మధ్యాహ్నం వరకు ఎవరూ పోలింగ్‌లో పాల్గొనకుండా కాపు కాశారు. కాగా, ఈ విషయాన్ని కొందరు ఓటర్లు ‘సాక్షి’ దృష్టికి తేవడంతో ప్రతినిధి బృందం ఊరందూరు ఎస్సీ కాలనీకి చేరుకుని ఎన్నికల అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసుల సహకారంతో కాలనీకి చెందిన 12 మంది దళితులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండల పరిధిలో ఆరు గ్రామాలకు చెందిన ఎస్సీలను 35 ఏళ్లుగా ఓటుహక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్న ఘటన 2019 సార్వత్రిక ఎన్నికల్లో వెలుగు చూడటం తెలిసిందే. 

మాకు నచ్చిన పార్టీకి ఓటు వేశాం: ఊరందూరు దళితులు
సాక్షి,  పోలీసుల సహకారంతో మా ఓటు హక్కును వినియోగించుకున్నాం. మాకు నచ్చిన పార్టీకి చెందిన నాయకుడికి ఓటు వేసినందుకు ఆనందంగా ఉంది.  

మరిన్ని వార్తలు