Dog Faced Water Snake: కుక్క మొహం పోలికతో ఉండే విష సర్పం.. ఈ స్నేక్‌ ఎంత డేంజరో తెలుసా?

25 Aug, 2022 21:05 IST|Sakshi

డాబాగార్డెన్స్‌(విశాఖ దక్షిణ): అరుదైన విషసర్పం కడలి ఒడికి చేరింది. విశాఖ నగరంలోని కాన్వెంట్‌ జంక్షన్‌ సమీపాన పారిశ్రామిక ప్రాంగణంలో మంగళవారం రాత్రి డాగ్‌ ఫేస్‌ సీ స్నేక్‌ను స్నేక్‌ క్యాచర్‌ రొక్కం కిరణ్‌ పట్టుకున్నారు.

కుక్క మొహం పోలికతో ఉండే ఈ పాము అతి ప్రమాదకరమైందని, దీని విషానికి విరుగుడు అందించే ఔషధం కూడా దొరకదని కిరణ్‌ తెలిపారు. తన 20 ఏళ్ల సర్వీస్‌లో దాదాపు 25 వేల పాముల్ని పట్టుకున్నానని, ఇటువంటి పామును మాత్రం ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ఈ సర్పాలు సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
చదవండి: భార్య ఉండగానే మరో మహిళతో లవ్‌ ఎఫైర్‌.. చివరికి బిగ్‌ ట్విస్ట్‌  
               

మరిన్ని వార్తలు