ఏపీలో డీసీసీబీ ఉద్యోగాలు.. జిల్లాల వారీగా వివరాలు

23 Nov, 2021 16:19 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌లోని ది డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌(డీసీసీబీ) పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్‌ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేయనుంది. 

డీసీసీబీ బ్యాంక్, కడపలో 75 క్లర్క్‌ పోస్టులు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, కడప జిల్లాలో ది కడప డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌.. క్లర్క్‌ పోస్టుల భర్తీకి అర్హులైన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 75
► అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్‌పై అవగాహనతోపాటు స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
► వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
► ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
► పరీక్షా విధానం: ఆన్‌లైన్‌ విధానంలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు. పరీక్షా సమయం 60 నిమిషాలు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 03.12.2021
► వెబ్‌సైట్‌: www.kadapadccb.in

డీసీసీబీ బ్యాంక్, కర్నూలులో 17 ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, కర్నూలు జిల్లాలో ది డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌(డీసీసీబీ).. క్లర్క్‌ పోస్టుల భర్తీకి అర్హులైన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 17
► పోస్టుల వివరాలు: స్టాఫ్‌ అసిస్టెంట్‌లు/క్లర్క్‌లు–09, అసిస్టెంట్‌ మేనేజర్లు–08.
► స్టాఫ్‌ అసిస్టెంట్‌లు/క్లర్క్‌లు: అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్‌ నాలెడ్జ్‌ తోపాటు స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
► అసిస్టెంట్‌ మేనేజర్లు: అర్హత: కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌/కామర్స్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఎకనమిక్స్‌/స్టాటిస్టిక్స్‌/తత్సమాన సబ్జెక్టుల్లో పీజీ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. వయసు: 01.10.2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
► ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
► పరీక్షా విధానం: ఆన్‌లైన్‌ విధానంలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది.నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు. పరీక్షా సమయం 60 నిమిషాలు ఉంటుంది. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 03.12.2021
► వెబ్‌సైట్‌: kurnooldccb. com

డీసీసీబీ బ్యాంక్, నెల్లూరులో 65 పోస్టులు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, నెల్లూరు జిల్లాలో ది నెల్లూరు డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌(ఏడీసీసీబీ).. ఉద్యోగాల భర్తీకి అర్హులైన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 65
► పోస్టుల వివరాలు: స్టాఫ్‌ అసిస్టెంట్‌లు/క్లర్క్‌లు–42, అసిస్టెంట్‌ మేనేజర్లు–23.
► స్టాఫ్‌ అసిస్టెంట్‌లు/క్లర్క్‌లు: అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్‌ నాలెడ్జ్‌తో పాటు స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
► అసిస్టెంట్‌ మేనేజర్లు: అర్హత: కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌/కామర్స్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఎకనమిక్స్‌/స్టాటిస్టిక్స్‌/తత్సమాన సబ్జెక్టుల్లో పీజీ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి. వయసు: 01.10.2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
► ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
► పరీక్షా విధానం: ఆన్‌లైన్‌ విధానంలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు. పరీక్షా సమయం 60 నిమిషాలు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)
► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 03.12.2021
► వెబ్‌సైట్‌: nelloredccb. com

మరిన్ని వార్తలు