తగ్గుతున్న వరద ప్రవాహం

8 Oct, 2021 05:09 IST|Sakshi
సాగర్‌లో నాలుగు క్రస్ట్‌గేట్ల ద్వారా విడుదలవుతున్న నీరు

శ్రీశైలం ప్రాజెక్ట్‌/విజయపురిసౌత్‌(మాచర్ల)/సత్రశాల(రెంటచింతల): శ్రీశైలం జలాశయానికి వస్తున్న వరద ప్రవాహం నెమ్మదిగా తగ్గుతోంది. గురువారం సాయంత్రం సమయానికి జూరాల, సుంకేసుల నుంచి 66,838 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. కుడి, ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 62,909 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.

సాగర్‌ ప్రాజెక్టులో నాలుగు క్రస్ట్‌గేట్ల ద్వారా 32,360 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు నుంచి 59,812 క్యూసెక్కుల నీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు