సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.50 లక్షల విరాళం

15 May, 2021 10:13 IST|Sakshi
మంత్రి కొడాలి నానికి చెక్కు అందిస్తున్న దీపక్‌ నెక్స్‌జెన్‌ ఫీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ అడుసుమిల్లి సుబ్రహ్మణ్యం 

హనుమాన్‌ జంక్షన్‌ రూరల్‌ (గన్నవరం): ముఖ్యమంత్రి సహాయనిధికి దీపక్‌ నెక్స్‌జెన్‌ ఫీడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం రూ.50 లక్షల విరాళం అందజేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం గుడివాడలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానిని కలసి రూ.50 లక్షల చెక్కును అందించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సుబ్రహ్మణ్యం కోరారు.

చదవండి: ఏపీ: జూన్‌ 22న వైఎస్సార్‌ చేయూత
పేదల ఆరోగ్యం కోసం ఖర్చుకు వెనుకాడం 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు