ఏపీ: నేటి నుంచి డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియ

16 Sep, 2021 09:08 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో వివిధ కోర్సులలో ప్రవేశానికి ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. (చదవండి: సీఎం జగన్‌ లేఖపై తక్షణం స్పందించిన విదేశాంగ శాఖ

షెడ్యూల్‌ ఇలా..
నోటిఫికేషన్‌ – సెప్టెంబర్‌ 16న
విద్యార్థుల రిజిస్ట్రేషన్‌ – 17–22 వరకు
వెబ్‌ ఆప్షన్ల నమోదు –  23–26 వరకు
వెరిఫికేషన్‌–  23, 24 (స్పెషల్‌ కేటగిరి)
సీట్ల కేటాయింపు–  29న 
కాలేజీల్లో రిపోర్టింగ్‌– సెప్టెంబర్‌ 30, అక్టోబర్‌ 1
తరగతుల ప్రారంభం– అక్టోబర్‌ 1 నుంచి (స్పెషల్‌ కేటగిరీ వెరిఫికేషన్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ విజయవాడ, డా.వీఎస్‌ కృష్ణా కాలేజీ విశాఖపట్నం, ఎస్వీ వర్సిటీ తిరుపతిలో జరుగుతుంది.) 

17, 18 తేదీల్లో ఏపీ ఐసెట్‌
ఏయూ క్యాంపస్‌ (విశాఖ తూర్పు):  రాష్ట్ర స్థాయిలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఐసెట్‌–2021 ఈ నెల 17,18 తేదీల్లో నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ ఆచార్య జి.శశిభూషణరావు ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా, హైదరాబాద్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పా టు చేశామన్నారు. నిమిషం ఆలస్యమైనా  విద్యార్థులను పరీక్షకు అనుమతించబోమని తెలిపారు.

చదవండి:
జేసీ బ్రదర్స్‌కు టీడీపీ ఝలక్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు