ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు

24 Aug, 2022 03:45 IST|Sakshi

ఆక్రమణలపై కేసుల నమోదు, కౌంటర్ల దాఖలుకు చర్యలు 

ఇందుకోసం నలుగురు రిటైర్డు జడ్జిల నియామకం 

ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దేవుడి భూములు ఆక్రమణలకు గురైనచోట సమర్థంగా కోర్టుల్లో కేసులు ఫైల్‌ చేయడంతోపాటు కోర్టుల్లో కేసులున్న చోట సకాలంలో కౌంటర్లు దాఖలు చేసేందుకు నలుగురు రిటైర్డు జడ్జిలనుగానీ, సీనియర్‌ న్యాయ వాదులనుగానీ నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. గొల్లపూడిలోని దేవదాయశాఖ కమిష నర్‌ కార్యాలయంలో మంగళవారం ఉన్నతాధికా రులు, అన్ని జిల్లాల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఆలయ ఆస్తుల్ని కాపాడేందుకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. గతంలో దేవుడి భూముల అంశంలో దేవదాయ శాఖకు వ్యతిరేకంగా కోర్టు తీర్పులు వచ్చినా పైకోర్టులకు అప్పీలుకు వెళ్లని వాటి విషయంలో అవసరమైతే సుప్రీంకోర్టులో స్పెషల్‌ పిటిషన్‌ వేసి ఆ భూములను దేవుడి ఆధీనంలోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు.  తొమ్మిదిమంది స్టాండింగ్‌ కౌన్సిళ్లను నియ మించమని అడ్వొకేట్‌ జన రల్‌కు లేఖ రాసినట్టు తెలి పారు. కోర్టుల్లో కౌంటర్ల దాఖలు అంశంలో అక్టో బర్‌లోపు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు.

కొత్తగా 2,699 ఆలయాలకు ధూపదీపనైవేద్యం పథకాన్ని అమలుచేయాలని నిర్ణయించామని, ఇప్పటికే 718 ఆలయాలకు మంజూరు చేశా మని, 1,981 ఆలయాలకు మంజూరు చేయబోతున్నామని చెప్పారు. ఆలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు న్యాయం చేసేలా త్వరలో ప్రకటన చేస్తామన్నారు. రాజమహేంద్రవరంలో హితకారిణి సమాజం ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిడెడ్‌ కాలేజీని విద్యాశాఖకు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ప్రతి మంగళవారం శాఖాపరమైన అంశాలపై సమీక్షిస్తానన్నారు. దసరా ఉత్సవాలు జరిగే ఆలయాల ఈవోలతో ఈ నెల 30న మాట్లాడనున్నట్లు ఆయన తెలిపారు.

నాయీ బ్రాహ్మణ నేతల వినతిపత్రం
ఆలయాల్లోని కేశఖండనశాలలో పనిచేసే నాయీ బ్రాహ్మణులు కొందరు పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. అధికారులతో సమీక్ష అనంతరం తిరిగి వెళుతున్న ఆయన కారుకు అడ్డంగా కూర్చుని తమ సమస్యలపై ఇప్పటికిప్పుడే ప్రభుత్వం స్పందించాలంటూ డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు