24 గంటలు గడవక ముందే బాధితునికి అందిన సాయం

24 Dec, 2022 13:46 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప: కడప జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి శుక్రవారం రోజున భూమయ్యపల్లె గ్రామానికి చెందిన ఓబులేసు తన కుమారుని అనారోగ్య సమస్యను సీఎం దృష్టికి తీసుకొచ్చాడు. దీనిపై స్పందించిన సీఎం జగన్‌ తక్షణమే లక్ష రూపాయలు మంజూరు చేయడంతో పాటు వైద్య ఖర్చులు భరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

అయితే ఈ రోజు (శనివారం) ఉదయం బాధితుల కుటుంబానికి డిప్యూటీ సీఎం అంజాబాద్‌, కడప నగర మేయర్‌ సురేష్‌ బాబు, జెడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సిద్ధవటం యానాదయ్య లక్ష రూపాయల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, ఉద్యానశాఖ వ్యవసాయ సలహాదారులు ప్రసాద్ రెడ్డి, కార్పొరేటర్లు&డివిజన్ ఇంఛార్జిలు, తదితరులు పాల్గొన్నారు.

చదవండి: (మరోమారు సీఎం జగన్‌ మానవత్వం)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు