‘వరద ప్రాంతాల్లో సీఎం జగన్‌లా మరే ముఖ్యమంత్రి పర్యటించలేదు’

26 Jul, 2022 20:17 IST|Sakshi

సాక్షి, అమరావతి: వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాగా మరే సీఎం పర్యటించలేదని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో మంగళవారం పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా నారాయణ స్వామి మాట్లాడుతూ.. ట్రాక్టర్, పడవలు, బురదలో సీఎం జగన్‌ పర్యటించారని ప్రశంసలు కురిపించారు. రామోజీరావు, రాధాకృష్ణ, ఎల్లో మీడియా మనిషి జన్మ ఎత్తితే దీనిని చూపించాలని సవాల్‌ విసిరారు.

చంద్రబాబుకి మానవత్వం లేదని, రోజూ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని నారాయణ స్వామి విమర్శించారు. చంద్రబాబు, ఎల్లో మీడియాకు కులపిచ్చి తప్ప వేరే ఆలోచన లేదని మండిపడ్డారు. ఎల్లో పత్రికలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో కల్తీ మద్యం ఎక్కడ లేదని స్పష్టం చేశారు. టీడీపీనే కల్తీ పార్టీ అని, ఎన్టీఆర్ పార్టీ తీసుకున్న కల్తీ నాయకుడు చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు.

‘టీడీపీ ఆఫీసు ఓ బార్‌లా తయారైపోయింది. టీడీపీ నేతలు తాగి మాట్లాడుతున్నట్టు వాగుతున్నారు. కల్తీ నిరూపించమంటే నిరూపించలేకపోతున్నారు. గతంలో మద్యం షాపులన్నీ టీడీపీ నేతలు పెట్టుకున్నవే. ఇప్పుడు ప్రభుత్వం బెల్టు షాపులను పూర్తిగా తొలగించింది. మద్యం వినియోగం గతం కంటే బాగా తగ్గింది’ అని నారాయణ స్వామి తెలిపారు.
చదవండి: వాలంటీర్లు బాగా పనిచేశారు.. సీఎం జగన్‌తో వరద బాధితులు

మరిన్ని వార్తలు