దశాబ్ధాల పోరాటానికి సీఎం జగన్‌ పరిష్కారం..

30 Sep, 2020 14:31 IST|Sakshi

సాక్షి, విజయవాడ: దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా గిరిజనులకు సీఎం జగన్ భూమి హక్కు కల్పిస్తున్నారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'అనేక దశాబ్దాల గిరిజనుల పోరాటానికి సీఎం జగన్ పరిష్కారం చూపారు. ఏ గిరిజనుడు, గిరిజన సంఘాలు పోరాటాలు చేయకుండానే సీఎం జగన్ ఈ హక్కులు కల్పిస్తున్నారు. లక్షా 10 వేల మందికి ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాలు ఇస్తున్నాం. సుమారు 2 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తున్నాం. కమ్యూనిటీ పట్టాల ద్వారా 60  వేల మందికి పంపిణీ చేస్తున్నాం.  (ఏపీ: పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం)

లక్షా 60 వేల ఎకరాలు కమ్యూనిటీ పట్టాలిస్తున్నాం. భూములు లేని గిరిజనులకు కూడా ఒక్కొక్కరికి 2 ఎకరాలు పంపిణీ చేస్తున్నాం. అనేక దశాబ్దాలుగా గిరిజనులు సాగు చేస్తున్న భూమికి రెవిన్యూ పట్టాలు కూడా పంపిణీ చేస్తున్నాం. మొత్తం 3 లక్షల 50 వేల ఎకరాలకు గిరిజనులకు సాగు హక్కు కల్పిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్దఎత్తున గిరిజనులకు భూ పంపిణీ చెయ్యలేదు. సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని గిరిజన పక్ష పాతిగా నిలిచారు' అని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. (నిజాలు దాచి.. నిందలు)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు