శ్రీకాకుళం: కారు ప్రమాదం.. డిప్యూటీ తహసీల్దార్‌ మృతి

20 May, 2022 10:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వివరాల ప్రకారం.. శ్రీకాకుళం నుంచి విజయవాడకు కారులో వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డిప్యూటీ తహసీల్దారు సతీష్ మృతి చెందారు. ఎమ్మార్వో వెంకటరావుకి తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విశాఖ అపోలో ఆసుపత్రికి తరలించారు. అనకాపల్లి మండలం శంకరం ఏలేరు కాలువ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహనంలో 6 గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు.

చదవండి: ఈత సంబురం విషాదం నింపింది.. నలుగురు చిన్నారులు మృతి

మరిన్ని వార్తలు