ప్రజల హక్కుగా సంక్షేమ పథకాలు: సజ్జల

27 Jul, 2021 20:50 IST|Sakshi

చంద్రబాబు అరాచక పాలనను ప్రజలు భరించలేక పోయారు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ సంక్షేమ పథకాల్లో కనీసం 20 శాతం కూడా చంద్రబాబు అమలు చేయలేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో దేవాంగ రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లబొయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అరాచక పాలనను ప్రజలు భరించలేక పోయారని, కులాలు, మతాలు, పార్టీలకతీతంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల హక్కుగా సీఎం జగన్ అందిస్తున్నారని తెలిపారు.

ఇచ్చిన మాటకు మించి సీఎం జగన్‌ పని చేస్తున్నారన్నారు..
బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, వెనకబడిన వర్గాలను రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేయాలని సీఎం జగన్ కృష్టి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటకు మించి సీఎం జగన్‌ పనిచేస్తున్నారన్నారు.

బీసీలు బలహీన వర్గాలు కాదు.. సమాజానికి వెన్నెముకలు
ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ, బీసీలు బలహీన వర్గాలు కాదని.. సమాజానికి వెన్నెముకగా పేర్కొన్నారు. బీసీలందరూ రాజకీయంగా, సామాజికంగా ఎదగాలన్నదే సీఎం జగన్‌ ఆకాంక్ష అని లేళ్ల అప్పిరెడ్డి అన్నారు.

ఆ ఘనత సీఎం జగన్‌దే..
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ మాట్లాడుతూ, బలహీన వర్గాలను పార్లమెంట్‌కు పంపిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాష్ట్రంలో గొప్ప అవకాశాలను సీఎం జగన్‌ కల్పిస్తున్నారని జోగి రమేష్‌ అన్నారు.

మరిన్ని వార్తలు