'ఏ ముఖ్య‌మంత్రీ చేయ‌ని సంక్షేమ ప‌థ‌కాలు'

11 Sep, 2020 14:56 IST|Sakshi

సాక్షి, విజ‌య‌వాడ : ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌న్నీ సంవ‌త్స‌ర కాలంలోనే నెర‌వేర్చిన  ఘ‌న‌త వైఎస్ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంద‌ని దేవినేని అవినాష్ అన్నారు. వైఎస్సార్ ఆస‌రా ప‌థ‌కాన్ని  విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో ప్రారంభించిన ఆయ‌న  మ‌హిళ‌ల‌తో క‌లిసి సీఎం జ‌గ‌న్ చిత్ర ప‌టానికి పాలాభిషేకం నిర్వ‌హించారు. వైఎస్సార్ ఆస‌రా ద్వారా అందిన న‌గ‌దుతో ఏర్పాటు చేసిన దుకాణాన్ని అవినాష్  ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ..సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వం మ‌హిళా సాధికార‌త కోసం ప‌నిచేస్తుంద‌ని, మ‌హిళ‌లు ఆర్థికంగా ఎద‌గ‌డానికి వైఎస్ జ‌గ‌న్ కృషి చేస్తున్నార‌ని తెలిపారు. దేశంలోనే ఏ ముఖ్య‌మంత్రి చేయ‌ని సంక్షేమ ప‌థ‌కాల‌ను సీఎం జ‌గ‌న్ అమ‌లు చేస్తున్నార‌ని పేర్కొన్నారు. గ‌త ప్ర‌భుత్వం ఓట్ల కోసం రాజ‌కీయాలు చేస్తు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం ప్ర‌జ‌లు త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్నార‌ని అవినాష్ అన్నారు. (‘మాకు చిరకాలం మీరే సీఎంగా ఉండాలి’)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా