వివేకా హత్య కేసులో వారిని కూడా విచారించండి: తులసమ్మ వాంగ్మూలం

26 Nov, 2022 14:37 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌కడప:  వైఎస్‌ వివేకా హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. ఇక, ఈ కేసులో పులివెందుల కోర్టులో మెజిస్ట్రేట్‌ ముందు దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి భార్య తులసమ్మ వాంగ్మూలం ఇచ్చారు. గత ఫిబ్రవరి 21న పులివెందుల కోర్టులో తులసమ్మ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ క్రమంలో సీబీఐ విచారణలో పలు అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని తులసమ్మ ఆక్షేపించారు. మరో ఆరుగురిని సీబీఐ విచారించాలని సీబీఐని తులసమ్మ కోరారు. వివేకా హత్యలో ఆర్థిక అంశాలు, కుటుంబ వివాదాలు ముడిపడి ఉన్నాయని ఆ అంశాలను పరిగణనలోకి తీసులేదని తులసమ్మ ఆరోపించారు. 

వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, బావమరిది శివప్రకాష్‌రెడ్డి, కొమ్మ పరమేశ్వర్‌రెడ్డి, బీటెక్‌ రవి, రాజశేఖర్‌ రెడ్డి, నీరుగుట్టు ప్రసాద్‌ను సీబీఐ విచారించేలా ఆదేశించాలని తులసమ్మ కోరారు. ఇక, తులసమ్మ పిటిషన్‌పై 9 నెలల తర్వాత వాంగ్మూలం నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు