శ్రీశైలం మల్లన్న క్షేత్రంలో కార్తీక శోభ..పోటెత్తిన జనం

13 Nov, 2022 10:28 IST|Sakshi

కార్తీకమాసం సందర్భంగా శివాలయాలన్ని భక్తులతో కిటకిట లాడుతున్నాయి. ఈ కార్తీక మాస పర్వదినంలో శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ మాములుగా ఉండదు. ఈ మేరకు కర్నూల్‌ జిల్లాలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రమైన  శ్రీశైలం వంటి పుణ్య క్షేత్రం గురించి చెప్పనవసరం లేదు. వారాంతపు సెలవులు కావడంతో శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.

భక్తులు ఆలయానికి ఎదురుగా ఉన్న గంగాధర మండపం, శివమాడ విధుల్లో దీపారాధనలు చేసుకున్నారు. ఇక కార్తీక మాసోత్సవాల సందర్భంగా ఆలయంలో గర్భాలయం అభిషేకాలు, స్పర్శ దర్శనం తదితర సేవలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా కేవలం శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్ల అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు.

స్వామి వారి ఉచిత దర్శనానికి సుమారు 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు పడుతోంది. లోక కళ్యాణం కోసం లక్ష దీపోత్సవం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు. అలాగే లక్ష దీపోత్సవంలో పాల్గొనే భక్తులకు కావాల్సిన వస్తువులను దేవస్థావం వారే ఉచితంగా అందించే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ  కార్తిక పర్వదినం సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలన్ని భక్తుల కోలహలంతో శివ నామ స్మరణతో మారుమ్రోగుతున్నాయి. 

(చదవండి: రబ్బర్‌ తొడుగులతో 12 మంది వైద్యుల బయోమెట్రిక్‌ హాజరు )

మరిన్ని వార్తలు