తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ 

23 May, 2022 05:33 IST|Sakshi
ఆలయం వెలుపల భక్తుల రద్దీ

లక్షకు చేరుతున్న రోజువారీ భక్తుల సంఖ్య 

టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు 

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతంలో శ్రీవారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 33 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. స్వామి వారి దర్శనార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉన్న భక్తులకు 12 గంటల్లోపు సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం క్యూలైన్, కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ మెరుగైన సౌకర్యాలు అందిస్తోంది.

భక్తులకు అన్నప్రసాదం, తాగు నీరు, చంటి పిల్లల కోసం పాలు అందజేస్తున్నారు. క్యూలో ఎలాంటి తోపులాట జరుగకుండా విజిలెన్స్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని టీటీడీ అధికారులు సూచనలు చేస్తున్నారు. శనివారం 83,739 మంది శ్రీవారిని దర్శించుకోగా, స్వామి వారికి 46,187 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శనివారం హుండీ కానుకలు రూ.4.2 కోట్లు వచ్చింది. 

మరిన్ని వార్తలు