ఇది ఏపీ పోలీసులు, ప్రజలు గర్వించదగిన రోజు: డీజీపీ

12 Oct, 2021 14:36 IST|Sakshi

సాక్షి, అమరావతి: కౌంటర్‌ టెర్రరిస్ట్‌ ఆర్గనైజేషన్‌ 7వ జాతీయ స్థాయి ఈవెంట్‌లో ఏపీ అక్టోపస్‌ బలగాలు మొదటి స్థానం సాధించాయి. ఏపీ పోలీసులకు, ప్రజలకు ఇది గర్వించదగ్గ రోజు అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'మన గ్రేహౌండ్స్‌ బలగాలు మంచి ప్రదర్శన చేస్తున్నాయి. అంతర్జాతీయస్థాయిలో కూడా ప్రతిభ కనిబరిచేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ముఖ్యమంత్రి కూడా అక్టోపస్‌ బలగాలను రీ లొకేట్‌ చేయాలని సూచించారు. ఇకపై జిల్లా కేంద్రాల్లో సైతం అక్టోపస్‌ బలగాలు సేవలు అందిచనున్నాయి. గ్రేహౌండ్స్‌, అక్టోపస్‌ బలగాలను ఇచ్చేందుకు కేంద్రం సహకరిస్తుంది. నైట్‌ ఫైరింగ్‌ విషయంలో ఏపీ అక్టోపస్‌ అత్యుత్తమ శిక్షణ ఇస్తోంది. రాష్ట్రంలో వివిధ ర్యాంకుల్లో మొత్తం 500 మంది అక్టోపస్‌ ఆఫీసర్లు ఉన్నారు. నైట్‌ ఫైరింగ్‌ విషయంలో ఏపీ అక్టోపస్‌ అత్యుత్తమ శిక్షణ ఇస్తోంది' అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు. 

చదవండి: (దుష్ప్రచారమే టీడీపీ అజెండా)

తప్పుడు ఆరోపణలు చేయొద్దు: డీజీపీ
ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్‌తో ఏపీకి సంబంధం  లేదు. ఈ విషయం చాలాసార్లు స్పష్టంగా చెప్పినా నిరాధార ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. మేం కూడా ఆ సంస్థలతో టచ్‌లో ఉన్నాం. కొన్ని రాజకీయ పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయి. ఈ తరహా విమర్శల వల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తున్నారు.

రాష్ట్రం పరువు పోయేలా కొన్ని పార్టీలు హెరాయిన్ విషయంలో ఆరోపణలు చేయడం సరికాదు. ప్రజల్లో, యువతలో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. కొందరు అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారు కాబట్టే నోటీసులు జారీ చేస్తున్నాం. తప్పుడు ఆరోపణలు చేయొద్దని మళ్లీ చెబుతున్నాం. ఎన్ఐఏ వాళ్లే కాకుండా ఇంకొన్ని దర్యాప్తు సంస్థలు వచ్చి ఉంటాయి. ఏపీకి వచ్చి విచారణ చేసుకుంటే తప్పేంటీ..? అని ప్రశ్నించారు. 

చదవండి: (AP: బడితోనే అమ్మఒడి)

మరిన్ని వార్తలు