మరో 24 గంటల పాటు పోలీసు శాఖ అప్రమత్తం

13 Oct, 2020 21:29 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పోలీసు శాఖ మరో 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని డీజీపీ గౌతం సవాంగ్‌ తెలిపారు. మరో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, వరద తీవ్రత ఎక్కవగా ఉండే ప్రాంతాలను ప్రత్యేకంగా పర్వవేక్షించాలని సూచించారు. ఈరోజు కురిసిన వర్షానికి ప్రజల ప్రాణాలు కాపాడటంతో పాటు ముంపు ప్రాంతాల బాధితులను పునరావాస కేందరాలకు తరలించడంలో పోలీసు శాఖ చోరవ ప్రశంసనీయం అన్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో సమన్వయంతో పోలీసులు పని చేయాడం అభినందనీయమని డీజీపీ వ్యాఖ్యానించారు. తప్పనిసరిగా 100/112కు డయల్‌ చేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.     

చెరువు తలపించిన వెలగపూడి హైకోర్టు ప్రాంగణం:
ఒక్కరోజు కురిసిన వర్షానికి వెలగపూడి తాత్కాలిక హైకోర్టు ప్రాంగణం చెరువును తలపిస్తోంది. హైకోర్టుకి వెళ్లే మార్గంలో వెలగపూడి వద్ద రోడ్డుపై దాదాపు మూడు అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. దీంతో హైకోర్టుకి వచ్చే ఉద్యోగులు, న్యాయవాదులు, కక్షిదారులు చెరువుగా మారిన రోడ్లపై ప్రయాణిస్తూ నానా ఇబ్బంధులు ఎదుర్కొన్నారు. ‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు