సమన్యాయంతో సీఎం జగన్‌ ఆదర్శంగా నిలిచారు

18 Jul, 2021 13:11 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు సముచిత స్థానం

డిప్యూటీ సీఎం కృష్ణదాస్

సాక్షి, శ్రీకాకుళం: నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారని  డిప్యూటీ సీఎం కృష్ణదాస్ అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మహిళలకు సముచిత స్థానం కల్పించారన్నారు. చంద్రబాబు హయాంలో నోరున్న వారికే పదవులు ఇచ్చారన్నారు. సమ న్యాయంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదర్శంగా నిలిచారన్నారు. ఏ అభివృద్ధికీ నోచుకోని వర్గాలకు సీఎం జగన్‌ న్యాయం చేశారని మంత్రి కృష్ణదాస్‌ కొనియాడారు.

మహిళలకు సముచిత స్థానం కల్పించారు: మంత్రి అప్పలరాజు
నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట వేశారని మంత్రి అప్పలరాజు అన్నారు. అణగారిన వర్గాలకు రాజకీయ అధికారం కల్పించారన్నారు. సామాజిక న్యాయ సాధన దిశగా సీఎం జగన్‌ మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించారని పేర్కొన్నారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50.40 శాతం పదవులు దక్కాయని మంత్రి అప్పలరాజు అన్నారు.

ఏపీలో సామాజిక న్యాయం: మంత్రి శంకర్‌నారాయణ
అనంతపురం: ఏపీలో సామాజిక న్యాయం జరుగుతోందని మంత్రి శంకర్‌నారాయణ అన్నారు. మహిళలకు అత్యధిక పదవులు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు. సీఎం జగన్‌ పాలనతో బాబు బెంబేలెత్తుతున్నారని శంకర్‌ నారాయణ ఎద్దేవా చేశారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు