రికార్డులు నేల'మట్టం'

19 Aug, 2020 08:18 IST|Sakshi
కొవ్వూరు–రాజమండ్రి వంతెనల వద్ద గోదావరి నీటి మట్టం

14ఏళ్ల తర్వాత ఇదే గరిష్ట వరద   

ఏడేళ్ల తర్వాత మళ్లీ మూడోప్రమాద హెచ్చరిక 

గరిష్టంగా 22,58,895 క్యూసెక్కులు సముద్రంలోకి  

కొవ్వూరు: 14ఏళ్ల తర్వాత గోదావరి వరద మరోసారి రికార్డు స్థాయిలో నమోదైంది. 2006లో ఆగస్టు ఏడో తేదీన గరిష్టంగా ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 22.80 అడుగుల నీటిమట్టం నమోదైంది. మళ్లీ ఆ స్థాయిలో వరద రాలేదు. ఆ తర్వాత 19 అడుగుల నీటిమట్టం నమోదు కావడం ఇది రెండోసారి. మొదట 2013లో గరిష్టంగా 19.0 అడుగుల నీటి మట్టం నమోదైంది. ఇప్పుడు ఆ రికార్డును దాటి 19.90 అడుగులకు నీటిమట్టం చేరింది. మంగళవారం సాయంత్రం ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం 19.90 అడుగులుగా నమోదైంది. ఆ తర్వాత కొద్దిగా నెమ్మదించి 19.80 అడుగులకు చేరింది.   2013 తర్వాత మూడోప్రమాద హెచ్చరిక స్థాయిలో వరద రాలేదు. ఏడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు మూడోప్రమాద హెచ్చరిక చేశారు.  

>
మరిన్ని వార్తలు