శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం​

21 Jan, 2021 20:30 IST|Sakshi

డీఐజీ పాల్రాజు

సాక్షి, మంగళగిరి: ఆలయాల్లో దాడులంటూ సోషల్‌ మీడియాలో సాగిన దుష్ప్రచారాలపై నిజాలు తెలియజేశామని డీఐజీ పాల్రాజు తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టులకు నిబద్ధత ఉండదని.. సామాజిక మధ్యమాల్లో దుష్ప్రచారంపై విచారణ చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆలయాలు ఆపదలో ఉన్నాయని దుష్ప్రచారం జరుగుతోందన్నారు. ‘‘2020- 2021లో జరిగిన ఆలయాలపై దాడుల వివరాలు డీజీపీ ఇచ్చారు. 44 కేసుల్లో జరిగిన దాడుల్లో అసలేం జరిగిందో కూడా చెప్పాం. అబద్ధపు ప్రచారాలు కూడా ఎలా జరిగాయో తెలిపాం. కొన్ని కేసులలో ముద్దాయిలు రాజకీయ నేపథ్యం కూడా వెల్లడించాం. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో రాసిన వార్తకు ఒక నిబద్ధత ఉంటుంది. సోషల్ మీడియాలో పోస్టు చేసిన వార్తలకు నిబద్ధత ఉండదు. (చదవండి: స్థానిక ఎన్నికలు: సుప్రీంను ఆశ్రయించిన సర్కార్‌)

2014లో ఏలూరులో జరిగిన ఘటనలో ఒక వ్యక్తిని అరెస్టు చేసి, శిక్ష వేశారు. అదే ఘటనను మరల జరిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. తమిళనాడు, కర్నాటకలో జరిగిన సంఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్టు ఆపాదిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ ప్రచారం పట్ల విచారణ చేస్తున్నాం. పోలీసు వ్యవస్థను దిగజార్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ప్రతి జిల్లాలో స్పెషన్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు చేశాం. పోలీసులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దు. లా అండ్‌ ఆర్డర్‌కు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని’’ డీఐజీ పాల్రాజు హెచ్చరించారు.(చదవండి: సీఎం జగన్‌ను కలిసిన బీవోబీ ఈడీ

మరిన్ని వార్తలు