'రైతుభ‌రోసా' కేంద్రాల్లో డిజిటల్ పేమెంట్

28 Jul, 2020 12:04 IST|Sakshi

సాక్షి, విజ‌య‌వాడ :  రైతుభ‌రోసా కేంద్రాల‌లో ప్ర‌యోగాత్మ‌కంగా డిజిట‌ల్ పేమెంట్ విధానాన్ని అమ‌లుచేశారు. దీని ద్వారా  రైతులు నేటినుంచి త‌మ‌కు కావాల్సిన ఉత్పాద‌కాలు. ఎరువులు, విత్త‌నాలు, మందులను కొనుగోలు చేయోచ్చు. డిజిటల్ విధానంలో చెల్లింపు ప్ర‌క్రియ‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ అగ్రోస్ సంస్థ నేటినుంచి సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్య‌మంత్రి సూచ‌న మేర‌కు న‌గ‌దు చెల్లింపుల‌తో పాటు డిజిటల్ విధానంలో కూడా రైతులు చెల్లిపులు చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీని ద్వారా రైతులు నేరుగా  భీం, గూగుల్ పే, పేటియం, ఫోన్ పే వంటి డిజిటల్ విధానంలో చెల్లింపులు జ‌రిపి  త‌మ‌కు కావాల్సినవి కొనుగోలు చేసే అవ‌కాశం ఉంటుంది. . 


 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు