లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తు నిర్వహణ శాఖ

2 Aug, 2021 22:23 IST|Sakshi

కృష్ణా: కృష్ణా నది వరద ప్రవాహం పెరుగుతున్నందున.. లోతట్టుప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణశాఖ తెలిపింది. విజయవాడలో 24 మంది సభ్యులతో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు. కాగా ప్రకాశం బ్యారేజ్‌ ఇన్‌ ఫ్లో 2.57 లక్షలు, ఔట్‌ ఫ్లో 2.57 లక్షల క్యూసెక్కులుగా ఉంది. రేపు(మంగళవారం) సాయంత్రానికి వరద ఉద్ధృతి తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. ఇక శ్రీశైలం ఇన్‌ ఫ్లో 4.35 లక్షలు, ఔట్‌ ఫ్లో 4.68 లక్షల క్యూసెక్కులు. అలాగే సాగర్‌ ఇన్‌ ఫ్లో 3.72 లక్షలు, ఔట్‌ ఫ్లో 3.55 లక్షల క్యూసెక్కులు. కాగా పులిచింతల ఇన్‌ ఫ్లో, ఔట్‌ ఫ్లో 3.13 లక్షల క్యూసెక్కులుగా ఉంది.

మరిన్ని వార్తలు