ఫోన్ వస్తే చాలు పోలీసులు ఎత్తుకుపోతారు

5 Aug, 2020 22:11 IST|Sakshi

విశాఖ లో మహిళల రక్షణ కోసం  చురుకుగా దిశ పోలీసులు

 సాక్షి, అమరావతి : మీరు ఒక మహిళ కావచ్చు మిమ్మల్ని తెలిసిన వ్యక్తి తెలియని వ్యక్తి వేధించే ప్రయత్నం కూడా జరగొచ్చు. ఎవరికైనా చెబితే పరువు పోతుందని భయం కూడా ఉండొచ్చు. అలాంటి అనుమానాలు అవసరం లేదు  చిన్న ఫోన్ కాల్ చేస్తే చాలు మీ పేరు రహస్యంగా ఉంచి వేధించే వ్యక్తి భరతం పట్టే పరిస్థితి ఇప్పుడు విశాఖ లో ఏర్పడింది. ఈ మధ్యకాలంలో విశాఖలో ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ఆఫీస్కి హడావిడిగా వెళ్లే మహిళలను బైక్ పై ఓ వ్యక్తి  అసభ్యంగా ప్రవర్తించి కొంత దూరం వెళ్లి ఆమె ముఖాన్ని తిరిగి చూసే ఘటనలు పెరిగాయి. ఇంటి నుంచి ఆఫీస్ కి ఎలా చేరాలి అన్న ఆలోచనతో వడివడిగా వెళ్తున్న దశలో ఊహించని ఈ పరిణామాలతో చాలా మంది మహిళలు షాక్కు గురయ్యారు. కొందరు ఇంట్లో వాళ్లకు చెప్పుకున్నారు మరికొందరు చెప్పుకోలేక కుమిలిపోయారు. కానీ బీచ్ లో ఇద్దరు మహిళలు మాత్రం జరిగిన ఘటనతో కోపంతో రగిలిపోయారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ ఇద్దరు మహిళలు సహకారంతో పోలీసులు ఆ అపరిచిత వ్యక్తిని అరెస్టు చేశారు. విశాఖలోని అఫీషియల్ కాలనీకి చెందిన రాంబాబు అనే ఈ వివాహితుడు గత కొన్నేళ్లుగా ఇలా ఒంటరి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్న ట్టు పోలీసులు గుర్తించారు. దిశ చట్టం పై అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అయితే ఇక్కడ చెప్పుకునే విషయం ఏమంటే జరిగిన అన్యాయంపై ధైర్యంగా ముందుకు రావడమే కాకుండా నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులకు సహకరించిన మహిళల గురించి..ఇలా ముందుకు వచ్చిన ఆ మహిళలను విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా అభినందించారు. Brave women అని కొనియాడారు. ఇలా మహిళలు ముందుకు రావడం మంచి పరిణామమని మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఉషశ్రీ పేర్కొన్నారు

మరిన్ని వార్తలు