కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు పంపిణీ

7 Jun, 2021 05:17 IST|Sakshi
ఆయుర్వేద మందును పంపిణీ చేస్తున్న ఆనందయ్య సోదరుడు

ముత్తుకూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆదివారం కరోనా నివారణకు ఆనందయ్య తయారు చేసిన ఆయుర్వేద మందును పంపిణీ చేశారు. గతంలో తయారీ, పంపిణీ జరిగిన ఆనందయ్య భూముల్లోనే ఈ దఫా కూడా పంపిణీ చేపట్టారు. ఓ వైపు సీవీఆర్‌ కాంప్లెక్స్‌లో ఆనందయ్య మందు తయారు చేస్తుండగా, మరో వైపు  పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలకు ఆయన సోదరుడు దానిని పంపిణీ చేశారు.

ఎప్పటిలానే జనం క్యూలో కిక్కిరిసి పోయారు. పోలీసులు 144 సెక్షన్‌ ఉందని ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ రద్దీని నియంత్రించారు.  ఇదిలా ఉండగా కరోనా నివారణ మందు కోసం ఎవరూ కృష్ణపట్నం గ్రామానికి రావద్దని ఆయుర్వేద నిపుణుడు బొనిగి ఆనందయ్య విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఒక వీడియో విడుదల చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి ద్వారా ఆయుర్వేద మందు పంపిణీ చేసిన తర్వాత మిగిలిన జిల్లాల వారికి అందజేస్తామన్నారు.  

మరిన్ని వార్తలు