60.95 లక్షలమందికి నేడు పింఛన్ల పంపిణీ

1 Jul, 2021 02:26 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 60.95 లక్షలమంది వృద్ధులు, వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ప్రభుత్వం గురువారం పింఛన్లు పంపిణీ చేయనుంది. వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులు పంపిణీ చేయనున్నారు.

ఇందుకోసం రూ.1,484.96 కోట్లను అన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు విడుదల చేసినట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తేదీ నుంచి 3 రోజుల పాటు వలంటీర్ల ద్వారా పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. 13 జిల్లాల్లోని డీఆర్‌డీఏ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన జిల్లా కాల్‌ సెంటర్ల ద్వారా ఈ ప్రక్రియను అధికారులు పర్యవేక్షిస్తారని తెలిపారు.  

మరిన్ని వార్తలు