ఏపీ: కొనసాగుతున్న ‘వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక’

1 Mar, 2021 08:16 IST|Sakshi

తెల్లవారుజామునుంచే ప్రారంభమైన పెన్షన్ల పంపిణీ

రాష్ట్రవ్యాప్తంగా 61.40 లక్షల మందికి పెన్షన్లు

రూ.1478.83 కోట్లు కేటాయించిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ‘వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక’ పంపిణీ ప్రారంభమైంది. సోమవారం తెల్లవారుజామునుంచే వలంటీర్లు.. పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఉదయం 9.30 గంటల వరకు 62.27 శాతం పింఛన్ల పంపిణీ పూర్తికాగా, 38.23 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేశారు. ప్రస్తుతం పెన్షన్ల పంపిణీ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో 61.40 లక్షల మందికి పెన్షన్లు ఉండగా.. వారికోసం రూ.1478.83 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. కాగా ప్రభుత్వం 2.66 లక్షల మంది వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేపట్టింది. బయోమెట్రిక్‌, ఐరిస్‌ విధానం ద్వారా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తున్నారు. అంతేగాక లబ్ధిదారులకు ఆర్‌బీఐఎస్‌ ద్వారా ఫేషియల్‌ అథెన్టికేషన్‌ నిర్వహిస్తున్నారు.

చదవండి:
చేతులెత్తేసిన టీడీపీ: పోటీ పడలేం బాబూ..!
కమలానికి ‘ఉక్కు’ భయం!

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు