రెండో దశలో 539 ఏకగ్రీవాలు..

10 Feb, 2021 21:16 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశలో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలోని 167 మండలాల పరిధిలో 3,328 పంచాయతీలకుగాను 539 ఏకగ్రీవమయినట్లు ఎస్‌ఈసీ ప్రకటించారు. మిగిలిన 2786 పంచాయతీలకు ఈనెల 13న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎస్‌ఈసీ వెల్లడించారు.

రెండో దశలో జిల్లాల వారీగా ఏకగ్రీవాల వివరాలు..

 • శ్రీకాకుళం: 278 పంచాయతీలకి గాను 41 పంచాయతీలు ఏకగ్రీవం
 • విజయనగరం: 415కి గాను 60 ఏకగ్రీవం
 • విశాఖ: 261కి గాను 22 ఏకగ్రీవం
 • తూర్పు గోదావరి: 247కి గాను 17 ఏకగ్రీవం
 • పశ్చిమ గోదావరి: 210కి గాను 15 ఏకగ్రీవం
 • కృష్ణా: 211కి గాను 36 ఏకగ్రీవం
 • గుంటూరు: 236కి గాను 70 ఏకగ్రీవం
 • ప్రకాశం: 277కి గాను 69 ఏకగ్రీవం
 • నెల్లూరు: 194కి గాను 35 ఏకగ్రీవం
 • చిత్తూరు: 276కి గాను 62 ఏకగ్రీవం
 • అనంతపురం: 308కి గాను 15 ఏకగ్రీవం
 • వైఎస్‌ఆర్‌ జిల్లా: 175కి గాను 40 ఏకగ్రీవం
 • కర్నూలు: 240కి గాను 57  ఏకగ్రీవం
   
Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు