మంచు.. ఎండ.. వాన! ఏజెన్సీలో విభిన్న వాతావరణం

26 Apr, 2022 13:24 IST|Sakshi
పాడేరులో ఎండకు గొడుగును ఆశ్రయించిన బాలింత  

రోజూ మధ్యాహ్నం వర్షాలే ...!  

సాక్షి, పాడేరు: ప్రకృతి అందాలకు నెలవైన మన్యం జిల్లాలో విభిన్న వాతావరణం కనిపిస్తోంది. మండు వేసవిలోనూ మన్యం వాసులు చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. వేకువజాము నుంచి ఉదయం 8 గంటల వరకు పాడేరు, అరకు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో పొగమంచు దట్టంగా కురుస్తోంది. సూర్యోదయం తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు.


                పాడేరులో కురుస్తున్న వర్షం

ఆ సమయంలో అధిక ఎండకు తాళలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గొడుగులను ఆశ్రయిస్తున్నారు. 35 నుంచి 37 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఒక్కసారిగా వాతావరణం  చల్లబడుతోంది. ఉన్నపళంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోజూ ఇదే పరిస్థితి నెలకుంటోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి పాడేరు, జి.మాడుగుల, హుకుంపేట, పెదబయలు, కొయ్యూరు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.


 పాడేరు–జి.మాడుగుల రోడ్డులోని పొగమంచు  
 

మరిన్ని వార్తలు