నాగేంద్ర నుంచి కీలక విషయాలు రాబడుతున్న​ దిశా టీమ్‌

6 Nov, 2020 18:06 IST|Sakshi

సాక్షి, విజయవాడ: దివ్య హత్య కేసులో నిందితుడిగా ఉన్న నాగేంద్రను జీజీహెచ్‌ నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరు పరచడానికి 24 గంటల సమయం ఉండటంతో పోలీసులు నిందితుడిని దిశ పోలీస్‌ స్టేషన్‌కి తీసుకొచ్చారు. దీంతో దిశా టీమ్‌ నాగేంద్ర నుంచి వాస్తవాలు రాబట్టే పనిలో పడ్డారు. గత రెండు గంటల నుంచి హత్యకు గల కారణాలపై పోలీసులు నాగేంద్ర నుంచి కీలక విషయాలు రాబడుతున్నారు. కోర్టు సమయం ముగియటంతో న్యాయమూర్తి ఇంటివద్దే నాగేంద్రను హాజరు పరిచే అవకాశం ఉంది. అనంతరం చార్జ్‌షీట్‌ దాఖలు చేసి నాగేంద్రను పోలీసులు కస్టడీకి కోరనున్నారు.  
(దివ్యది హత్యే.. తేల్చిన పోలీసులు)

మరిన్ని వార్తలు