సీఎంను కలవనున్న దివ్య తేజస్విని తల్లిదండ్రులు 

20 Oct, 2020 10:23 IST|Sakshi

సాక్షి, గుంటూరు: విజయవాడలో ప్రేమోన్మాది నరేంద్రబాబు చేతిలో హతమైన దివ్య తేజస్విని తల్లిదండ్రులు మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలవనున్నారు. మూడు రోజుల క్రితం హోంమంత్రి సుచరిత దివ్యతేజస్విని తల్లిదండ్రులను పరామర్శించటానికి వెళ్లిన సందర్భంగా, తమకు సీఎంను కలిసే అవకాశం కల్పించమని హోంమంత్రిని కోరారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎంను కలవటానికి హోంమంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని ఏర్పాట్లు చేశారు.

ఈ సందర్బంగా దివ్య తేజస్విని కుటుంబసభ్యులు సాక్షి టీవీతో మాట్లాడారు. 'సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్ ఇవ్వడం మా అదృష్టం. మహిళా పక్షపాతిగా ఉండే సీఎం మాకు అవకాశం కల్పిస్తారని తెలుసు. మాకు జరిగిన అన్యాయాన్ని సీఎం జగన్‌కు వివరిస్తాం. నిందితుడు నాగేంద్రను ఉరితీయాలని కోరతాం' అని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. కాగా విజయవాడకు చెందిన బీటెక్‌ విద్యార్థిని దివ్య తేజస్విని ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. (అమ్మాయిలు ధైర్యంగా ఉండండి: సుచరిత)

మరిన్ని వార్తలు