-

AP: డాక్టరమ్మ గొప్ప మనస్సు.. రూ.20 కోట్ల భారీ విరాళం

7 Oct, 2022 08:06 IST|Sakshi

గుంటూరు జీజీహెచ్‌లో ఎంసీహెచ్‌ భవన నిర్మాణానికి అందజేత

డాక్టర్‌ ఉమ గవినిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్న నెటిజన్లు 

గుంటూరు మెడికల్‌: ఓ డాక్టరమ్మ తాను వైద్య విద్యను అభ్యసించిన కళాశాలకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.20 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా, తెనాలి సమీపంలోని కూచిపూడికి చెందిన డాక్టర్‌ గవిని వెంకటకృష్ణారావు రెండో కుమార్తె డాక్టర్‌ ఉమ గవిని. గుంటూరు వైద్య కళాశాలలో వైద్య విద్యనభ్యసించారు. అమెరికాలో 40 ఏళ్ల కిందట స్థిరపడి, ఇమ్యునాలజిస్టుగా వైద్య సేవలు అందిస్తున్నారు.
చదవండి: ‘సంక్షేమం’ ఖర్చులో ఏపీదే అగ్రస్థానం 

గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికా (జింఖానా)కు అధ్యక్షురాలిగా పనిచేసిన ఆమె ప్రస్తుతం జింఖానా కోశాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్‌)కి డాక్టర్‌ ఉమ గవిని విరాళం ప్రకటించారు. అధిక మొత్తంలో విరాళం ప్రకటించిన డాక్టర్‌ ఉమ గవిని దాతృత్వాన్ని ప్రశంసిస్తూ అనేక పోస్టులు ఆమెకు మద్దతుగా సోషల్‌ మీడియాలో పెట్టారు.  

మరిన్ని వార్తలు