ఉత్సాహం కోసం కోవిడ్‌ రోగుల డ్యాన్స్‌

23 Aug, 2020 09:08 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుతం కరోనావైరస్‌ తీవ్రత కంటే మానసిక ఆందోళన మనుషుల్ని అధికంగా ఇబ్బంది పెడుతోంది. దాంతో పలువురు వైద్య సిబ్బంది వైరస్‌ బాధితుల్లో ఉత్సాహాన్ని నింపుతూ డ్యాన్సులు వేయడం, పాటలు పాడటం వంటి విశేషాలను చూశాం. తాజాగా జిల్లాలోని పాడేరు కోవిడ్‌ సెంటర్‌ వైద్య సిబ్బంది కరోనా సోకిన పేషెంట్లలో ఆనందాన్ని నింపారు. స్థానిక యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో కోవిడ్ రోగుల కోసం ఏర్పాటు కరోనా సెంటర్‌లో వైద్య సిబ్బంది రోగులను ఉత్సాహపరుస్తూ ఉర్రుతూలుగించే పాటలకు స్టెప్పులు వేయించారు. (తెలంగాణలో కొత్తగా 2,384 కరోనా కేసులు)

దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పాజిటివ్ లక్షణాలకు గురైన వ్యక్తుల్లో కొంత ఉత్సాహం నింపినట్లయితే త్వరితగతిన వారు కోలుకునే అవకాశాలు ఉంటాయని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి పాజిటివ్ లక్షణాలు సోకడం సహజంగా మారిందని తెలిపారు. కానీ, కోవిడ్ వచ్చిందని మానసిక ఆందోళన చెందడం సరికాదని వైద్య వర్గాలు సూచించాయి. ఇక ఇటీవల పాడేరు ఏజెన్సీలో కూడా వైరస్‌ పాజిటివ్‌ లక్షణాలు ఉన్న వ్యక్తుల సంఖ్య పెరుగుతున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు