పిల్లి కూనలకు ప్రేమతో...

31 Jul, 2021 08:31 IST|Sakshi

తల్లి లేని ఆ పిల్లి పిల్లలకు శునకమే తల్లైంది. జాతి వైరాన్ని మరిచి వాటి కి పాలిస్తూ.. ప్రేమను పం చుతోంది. విశాఖ పెదగదిలి ప్రాంతంలో ఓ పిల్లి రెండు వారాల కిందట నా లుగు పిల్లలకు జన్మని చ్చింది. అనారోగ్యంతో రెండు పిల్లలు, తల్లి మరణించాయి. మిగిలిన రెండు పిల్లి పిల్లలు రోడ్డు పక్కన రోజూ వచ్చి పడుకుంటున్న ఓ శునకం వద్దకు వెళ్లి పాలు తాగుతూ ఆకలి తీర్చుకుంటున్నాయి.
 – ఆరిలోవ (విశాఖ తూర్పు)

మరిన్ని వార్తలు