ఇళ్ల పట్టాలపై స్టే తెచ్చిన వారంతా ఉపసంహరించుకోండి

26 Dec, 2020 14:59 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : విప్లవాత్మక ఆలోచన చేసి పేదలందరికీ ఇల్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే చెందుతుందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన శనివారం మాట్లాడుతూ.. ఇళ్ల పట్టాల పంపిణీ కేవలం సంక్షేమ కార్యక్రమం కాదని, ఒక ఆర్థిక కార్యక్రమం కూడా అని పేర్కొన్నారు. దీని ద్వారా ఎంతో మందికి ఉపాధి కలగనుందని తెలిపారు. కరోనా పరిస్థితుల్లో సంక్షేమం అందిస్తూ ఆర్థిక పరిపుష్టికి కృషి చేస్తున్నారు. దీని ద్వారా 20 కోట్ల మందికి పనిదినాలు దొరుకుతాయన్నారు. దీనిని టీడీపీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు. వారు జీవితంలో ఇలాంటి విప్లవాత్మక కార్యక్రమం చేపట్టారా.. అని ప్రశ్నించారు. అసలు ఒక సెంటు స్థలం అయినా ఇవ్వని వారికి ఈ రోజు విమర్శించే హక్కు ఉందా అని మండిపడ్డారు. చదవండి: ‘పేదలకు ఇళ్లు.. ఆయనకొచ్చిన నష్టమేమిటి?’

అమరావతిలో పేద వారికి ఇల్లు ఇస్తామంటే సామాజిక అసమతుల్యత అన్నది మీరు కాదా. మీకు చిత్త శుద్ధి ఉంటే.. ఎలాంటి దురుద్దేశం లేకపోతే ఆ కేసును ఉపసంహరించుకోండి. పేదలకు ఇళ్ళు ఇద్దాం.ఇల్లు అనేది ఒక ఆత్మగౌరవం...సామాజిక స్థితి పెరుగుతుంది...అది మీకు ఇష్టం లేదా...? ఈ ఇళ్ల కోసమే కదా ఆందోళనలు చేసింది. ఒక ముఖ్యమంత్రి నేను ఇస్తాను అంటే వ్యతిరేకిస్తారా. కనీసం ఇలాంటి పోరాటాలు చేసిన కమ్యూనిస్టులు అయినా అభినందలు తెలపండి. ఇళ్ల పట్టాలపై స్టే తెచ్చిన వారంతా ఉపసంహరించుకోండి. లేదంటే మీరు చరిత్ర హీనులుగా మిగులుతారు. మీరు రైతులను బెదిరించి భూములు తీసుకున్నారు...మా జగన్ గారు చట్టప్రకారం 2013 యాక్ట్ ప్రకారం సేకరించారు. చదవండి: సొంతింటి కల సాకారం

మరిన్ని వార్తలు