చట్ట ప్రకారం చట్టానికి తూట్లు.. రామోజీ నమ్ముకున్న సిద్ధాంతం ఇదే..

16 Apr, 2023 08:36 IST|Sakshi

రామోజీరావు మార్గదర్శిలో ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారో ఆయన తోడల్లుడు డాల్ఫిన్‌ అప్పారావు వెల్లడించారు. చట్టాన్ని కూడా చట్టప్రకారమే అతిక్రమిస్తూ మార్గదర్శిని ఒక ప్రత్యేక సామ్రాజ్యంగా రామోజీ చూశారని వివరించారు. ఇందుకు సంబంధించిన కీలక విషయాలు ఆయన మాటల్లోనే..

2,600 మంది కస్టమర్ల సొమ్ముని వెంటనే కట్టాలని ఆర్‌బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. అప్పటికప్పుడు సొమ్ములు తిరిగి వెనక్కు తీసుకురాలేని తరుణంలో వివిధ అంతర్జాతీయ కంపెనీలతో రామోజీరావు చర్చలు జరిపారు. అయితే అంత పెద్దమొత్తం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో రామోజీ.. చంద్రబాబుని సంప్రదించారు. ఆయన రిలయన్స్‌ని, నిమేష్‌ అంబానీ అనే బ్రోకర్‌ని పట్టుకున్నారు.

రామోజీ సంస్థల షేర్లు ఒక్కోటి రూ.500గా ఉంటే రూ.5 వేలుగా చూపించి నిధులు తెచ్చారు. తద్వారా 2,600 మంది కస్టమర్లలో కొంతమందికి చెల్లించారు. అయితే ఎంతమందికి ఇచ్చామనే వివరాల్ని ఇప్పటికీ రామోజీ బయటపెట్టలేదు. పైగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని వాదిస్తుంటారు. అంత పెద్ద వ్యక్తిపైన ఫిర్యాదు చేస్తే.. తమ భవిష్యత్తు ఏమవుతుందనే భయంతోనే డిపాజిటర్లు వెనకడుగు వేశారు. అది కూడా ఆ రోజుల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అప్రమత్తమ­వ్వడంతోనే కొంతమందికి చెల్లించారు.

మూడో వ్యక్తికి తెలియకుండా రామోజీ, శైలజ జాగ్రత్తపడ్డారు..
మార్గదర్శిలో మేనేజర్లు అకౌంట్స్‌ చేయడం, రిజిస్టర్స్‌ నిర్వహించడం మొదలైనవన్నీ చేయాల్సి ఉంటుంది. కానీ.. వారందర్నీ రామోజీ డమ్మీలుగా చేసేశారు. ఏ బ్రాంచ్‌లో డబ్బులు వచ్చినా ప్రధాన కార్యాలయానికి పంపించాలనే హుకుం జారీ చేశారు.

వివిధ జిల్లాల్లో వసూలైన చిట్స్‌ డబ్బులు మొత్తం ప్రధాన కార్యాలయంలోనే ఉంటాయి. ఏ జిల్లాలో ఎన్ని డిఫాల్టులుఉన్నాయి.. ఎంత మొత్తం వస్తుంది.. అనేది ఎవరికీ తెలీదు. రామోజీ మార్గదర్శిని ఒక ప్రత్యేక సామ్రాజ్యంగా చూశారు. ఇందులో ఏం జరుగుతుందనేది మూడో వ్యక్తికి కూడా తెలియకుండా రామోజీ, శైలజ జాగ్రత్తపడ్డారు. రామోజీ నమ్ముకున్న సిద్ధాంతం ఒక్కటే.. బ్రేక్‌ ది లా.. లాఫుల్లీ. అంటే.. చట్టాన్ని కూడా చట్టప్రకారమే అతిక్రమిస్తుంటారు.

చదవండి: కీలక ‘లేఖ’పై కిమ్మనరెందుకు?

మరిన్ని వార్తలు