అరకు: మద్యం మత్తులో యువతి హల్‌చల్‌..

4 Dec, 2022 15:23 IST|Sakshi

సాక్షి, అల్లూరి జిల్లా: ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులో ఓ యువతి మద్యం మత్తులో రెచ్చిపోయింది. పీకల దాకా మద్యం సేవించి ఓ దుకాణ యజమానురాలితో అనుచితంగా ప్రవర్తిస్తూ హల్‌చల్‌ చేసింది. 

అంతటితో ఆగకుండా ఆమెను బూతులు తిడుతూ హంగామా చేసింది. ఆమె చేష్టలకు అక్కడున్న వారంతా షాకయ్యారు. అయితే, ఆమెను దారుణంగా తిట్టిన తర్వాత ఓ చోట కూర్చుని ఆమె విచిత్రంగా ప్రవర్తించింది. బుట్టు పీక్కుంటూ నేను ఏ తప్పు చేయలేదు. నేనేమీ చేయలేదు అంటూ గట్టిగా అరస్తూ కేకలు పెట్టింది. ఈ క్రమంలో సదరు మహిళపై.. దుకాణం యజమానురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం.. పోలీసులు యువతిని స్టేషన్‌కు తీసుకుని వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. 

మరిన్ని వార్తలు