జేసీ పవన్‌ను ముందుగానే హెచ్చరించాం

9 Aug, 2020 07:37 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు  

శాంతిభద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం

సాక్షి, తాడిపత్రి: శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు అన్నారు. పట్టణంలో 30 యాక్ట్‌ అమలులో ఉందని, ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. శనివారం పట్టణంలోని ప్రధాన రహదారుల్లో పోలీసుల వాహన శ్రేణి కవాతుతో పాటు, ఏరియా డామినేషన్‌ పెట్రోలింగ్‌ను నిర్వహించారు. ఈ వాహన శ్రేణి స్థానిక గాంధీ సర్కిల్‌ వద్దకు చేరుకున్న అనంతరం డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. పట్టణంలో 144 సెక్షన్‌ అమలులో ఉందని, అత్యవసర పరిస్థితుల్లో తప్పా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పట్టణంలోకి రాకూడదన్నారు. (మళ్లీ జైలుకు జేసీ..)

ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకూ ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జేసీ పవన్‌కు ముందుగానే తాము హెచ్చరికలు జారీ చేసినా వాటిని పెడచెవిన పెట్టిన కారణంగానే కడపలో నిబంధనలు ఉల్లంఘించిన కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆర్‌ఎస్‌.కొండాపురం మండలం తాళ్లపొద్దుటూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కూడా జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి, జేసీ పవన్‌రెడ్డిలపై కేసులు కూడా నమోదయ్యాయన్నారు. తాడిపత్రి పోలీస్‌స్టేషన్ల పరిధిలో కూడా పలు కేసులు నమోదు చేశామన్నారు. 

మరిన్ని వార్తలు