MPP Elections: నారా లోకేశ్‌ దారుణాలు సృష్టిస్తున్నారు: ఆళ్ల రామకృష్ణారెడ్డి

5 May, 2022 10:35 IST|Sakshi

సాక్షి, గుంటూరు: దుగ్గిరాల ఎంపీపీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోటీలో ఒక్కరే ఉండటంతో ఎంపీపీగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దానబోయిన సంతోష రూపవాణి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు

మొత్తం 18 ఎంపీటీసీ స్థానాలకు గాను 9 స్థానాల్లో టీడీపీ, 8 స్థానాల్లో వైఎస్సార్సీపీ, ఒక స్థానంలో జనసేన విజయం సాధించింది. కాగా, బీసీ మహిళకు ఎంపీపీ స్థానం రిజర్వ్‌ చేసి ఉంది. అయితే, టీడీపీ నుంచి బీసీ మహిళ సభ్యురాలు లేకపోవడంతో వైఎస్సార్సీపీ మహిళా సభ్యులను ప్రలోపెట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా.. వైఎస్సార్సీపీ నుంచి ఇద్దరు మహిళలు ఎంపీటీసీలుగా గెలుపొందారు.

ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రజాస్వామ్యంగా జరగాల్సిన ఎన్నికల్లో ఎందుకు గందరగోళం సృష్టిస్తున్నారు. మేము ఎక్కడా తప్పు చేయలేదు. గెలిచిన 8 మందితోనే మేము ముందుకు వెళ్తాం. టీడీపీలో మహిళా అభ్యర్థి లేకపోవడంతో పచ్చనేతలు వైఎస్సార్సీపీ నేతలను మభ్యపెడుతున్నారని తమ వైపు లాక్కోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే దుగ్గిరాలలో నారా లోకేశ్‌ దారుణాలు సృష్టిస్తున్నారు’’ అని విమర్శించారు. 

ఇది కూడా చదవండి: ఈనెల 7,8 తేదీల్లో ఏఎన్‌యూలో వైఎస్సార్‌ సీపీ మెగా జాబ్‌ మేళా 

మరిన్ని వార్తలు