5న దుగ్గిరాల ఎంపీపీ, వైస్‌ ఎంపీపీల ఎన్నిక

2 May, 2022 20:26 IST|Sakshi

దుగ్గిరాల(తెనాలిటౌన్‌): దుగ్గిరాల మండల పరిషత్‌ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఈనెల 5న జరుగుతుందని ఎంపీడీఓ కుసుమ శ్రీదేవి ఆదివారం తెలిపారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిందని ఆమె వివరించారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా తాడేపల్లి ఎంపీడీఓ రామ ప్రసన్న వ్యవహరిస్తారని, గతంలో కోరం లేక పోవడంతో మండల పరిషత్‌ అధ్యక్షుని ఎన్నిక జరగలేదని వివరించారు.

దుగ్గిరాల మండల పరిషత్‌ కార్యాలయంలో 5న ఉదయం 10గంటలకు కో–ఆప్షన్‌ సభ్యుడి పదవికి నామినేషన్ల దాఖలు, మధ్యాహ్నం 12 గంటల లోపు నామినేషన్ల పరిశీలన, ఒంటిగంట తరువాత నామినేషన్ల ఉపసంహరణ, అనంతరం కో–ఆప్షన్‌ సభ్యుని ఎన్నిక జరుగుతుందని, మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎంపీపీ, వైస్‌ ఎంపీపీల ఎన్నికతో ఈ ప్రక్రియ ముగుస్తుందని ఎంపీడీఓ వెల్లడించారు.  

మరిన్ని వార్తలు