దుర్గమ్మ నదీ విహారానికి బ్రేక్ 

24 Oct, 2020 14:02 IST|Sakshi

సాక్షి, విజయవాడ: కృష్ణానదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో దుర్గమ్మ నది విహారానికి అధికారులు అనుమతి నిరాకరించారు. ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం కొనసాగుతుండడంతో ఈ ఏడాది తెప్పోత్సవానికి ఆటంకం ఏర్పడింది. ఫ్రంట్ మీద అమ్మవారికి పూజలు మాత్రమే నిర్వహించాలని కో ఆర్డినేషన్ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు, ఇతర అధికార యంత్రంగం కీలక నిర్ణయం తీసుకున్నారు. 

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలలో చివరి రోజు (ఆదివారం)  ఆది దంపతులు కృష్ణానదిలో విహరించడం ఆనవాయితీ. అయితే ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటం, ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో తెప్పోత్సవం నిర్వహణపై జిల్లా కలెక్టర్‌తో దేవస్థాన అధికారులు చర్చించి, తెప్పోత్సవంపై తుది నిర్ణయం తీసుకున్నారు. కాగా  ఉత్సవ మూర్తులను హంస వాహనంపై ఉంచి మూడుసార్లు వాహనాన్ని ముందుకు వెనక్కు తిప్పుతారు. దీంతో నదీ విహారం పూర్తయినట్లే.. గతంలో 2004లో ఇదే తరహాలో తెప్పోత్సవాన్ని నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా దుర్గగుడి ఇంజినీర్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘ప్రకాశం బ్యారేజీలో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున స్వల్ప మార్పులతో తెప్పోత్సవం నిర్వహించాలని నిర్ణయం జరిగింది. నదిలో విహారం లేకుండా దుర్గా మళ్లేశ్వర స్వామి వార్ల  తెప్పోత్సవం నిర్వహిస్తాం. తెప్పోత్సవం సందర్భంగా రేపు సాయంత్రం కృష్ణా నదిలో దుర్గా మళ్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు యథాతథంగా పూజలు జరుపుతాం. పరిమిత సంఖ్యలో అర్చకులతో నదిలో ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహిస్తాం. తెప్పోత్సవం జరుగుతున్నంత సేపు కొత్తగా నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్‌పై  వాహనాలు, భక్తులు రాకపోకలు  ఆపేస్తాం.’ అని తెలిపారు. (చదవండి: ‘సీఎం జగన్‌ స్పందన అభినందనీయం)

సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల శ్రేయస్సే ముఖ్యమని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. కోవిడ్‌ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మార్గదర్శకాల ప్రకారమే నడుచుకోవాలని అన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. నవంబర్‌, డిసెంబర్‌లో మరోసారి వైరస్ వ్యాప్తి జరిగే అవకాశం ఉందన‍్నారు. దసరా తర్వాత  సెకెండ్ వేవ్‌ ఉంటుందని నిపుణులు చెబుతున్నారన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

మరిన్ని వార్తలు