ఆంధ్రజ్యోతి కథనం ఆరోపణలను ఖండించిన దుర్గగుడి, వివరణ కోరుతూ..

7 Aug, 2023 18:59 IST|Sakshi

సాక్షి, కృష్ణా: విజయవాడ దుర్గగుడికి చెందిన సీవీ రెడ్డి ఛారిటీస్‌లో మాంసాహారం పేరుతో వార్తను ప్రచురించింది ఆంధ్రజ్యోతి. పోలీసులు మాంసాహారం వండుకుని తిన్నారంటూ అందులో పేర్కొంది.  అయితే ఆ పత్రికలో వచ్చిన కథనాన్ని ఖండించారు దుర్గగుడి అధికారులు. 

దుర్గ గుడి ఈవో భ్రమరాంబ ఆదేశాల మేరకు సత్రాన్ని సందర్శించి.. అన్ని రూములు, పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు అధికారులు. ఆపై సత్రంలో ఎలాంటి మాంసాహారం వండటం స్వీకరించడం లేదని పర్యవేక్షణాధికారి స్పష్టత ఇచ్చారు. 

తప్పుడు కథనం ఆధారంగా.. చేసిన ఆరోపణలను నిరూపించడంతో పాటు  రేపటి పేపర్‌లో వివరణ ప్రచురించాల్సిందిగా ఆంధ్రజ్యోతిని అధికారులు కోరినట్లు ఈవో వెల్లడించారు. 

మరిన్ని వార్తలు